కలుపు నివారణకు చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:28 PM
వరి ఎదలో కలుపు నివారణకు ప్రిటలా క్లోర్ మందును ఇసుకతో కలి పి జల్లుకోవాలని టెక్కలి ఏడీ ఏ కె.జగన్మోహనరావు అన్నారు.
కోటబొమ్మాళి, జూలై 1( ఆంధ్రజ్యోతి): వరి ఎదలో కలుపు నివారణకు ప్రిటలా క్లోర్ మందును ఇసుకతో కలి పి జల్లుకోవాలని టెక్కలి ఏడీ ఏ కె.జగన్మోహనరావు అన్నారు. మంగళవారం ఎత్తురాళ్ల పాడులో ఏవో ఎస్.గోవింద రావు ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వ హంచారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ..వరి ఎదకు అధిక దిగు బడి వచ్చేందుకు ఎద వేసిన 15 రోజుల్లోగా ఒక బస్తా డీఏపీ, 25 కిలోల యూరియా, 20 కేజీల పొటాష్ వేయాలని సూచించారు. మెట్ట భూముల్లో వరి పంటకు బదులు ఉద్యాన వన పంటలను వేయాలన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
ఎదలతో అధిక లాభం
పలాస, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో విత్తనాలు ఎద చల్లడం ద్వారా అధిక లాభం సాధించవచ్చని వ్యవసాయశాఖ ఏడీ ఎం. రామారావు తెలిపారు. ఈ మేరకు మంగళ వారం మొగిలిపాడు, కైజోల గ్రామాల్లో రైతుల కు వరి ఎద సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధి కారుల సూచనలు, మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి పొందే అవకాశం ఉందన్నారు. ఎద లు వేయడం ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు కూలీల సమస్య ఉందన్నారు. వ్యవసాయాధి కారి పోలారావు, శారద, రాధ పాల్గొన్నారు.