Share News

మెగా జాబ్‌ మేళాను వినియోగించుకోండి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:05 AM

జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనకు ఈనెల 10న స్థానిక అభ్యుదయ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు.

మెగా జాబ్‌ మేళాను వినియోగించుకోండి
మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనకు ఈనెల 10న స్థానిక అభ్యుదయ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర నైపు ణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మేళాలో 18 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 1000 ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువ కులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్‌ఎస్‌సీ నుంచి డిగ్రీ అర్హత కలిగి, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయ సున్న యువతీ యువకులు అర్హులన్నారు. అభ్యర్థులు తప్పని సరిగా ‘నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్‌’లో నమోదు చేసుకో వాలని, రిజిస్ట్రేషన్‌ నెంబరు, బయోడేటా, ఆధార్‌, విద్యార్హతల ప్రతులు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావా లన్నారు. మరిన్ని వివరాలకు 97049 60160, 63010 45132 నెంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపు ణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:05 AM