Share News

తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:09 AM

మాజీ మంత్రి గౌతు శివాజీ, వారి కుటుంబ సభ్యులపై తప్పుడ ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న మందస మండలం బేతాలిపురం గ్రామానికి చెందిన బత్తిన లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు గోవిందపురం ఆధ్వ ర్యంలో ఆ పార్టీ నాయకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తప్పుడు ఆరోపణలు  చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి
వజ్రపుకొత్తూరుతి: పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

వజ్రపుకొత్తూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి గౌతు శివాజీ, వారి కుటుంబ సభ్యులపై తప్పుడ ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న మందస మండలం బేతాలిపురం గ్రామానికి చెందిన బత్తిన లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు గోవిందపురం ఆధ్వ ర్యంలో ఆ పార్టీ నాయకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌతు శివాజీ వెయ్యి ఎకరాలు సోంపేట వద్ద లాక్కున్నట్టు ఆరోపించారన్నారు. కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజలకు రెచ్చగొడుతున్నట్టు ఫిర్యా దులో పేర్కొన్నారు. బత్తిన లక్ష్మీనారాయణపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో గోవింద పాపారావుతో పాటు పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ దువ్వాడ హేంబాబు చౌదరి, మాజీ సర్పంచ్‌లు పోతనపల్లి సాంబమూర్తి, అంబటిరామకృష్ణ, ఆకుల పాపారావు, మాజీ కో ఆప్షన్‌ కె.వెంకటరమణ, వంక రామారావు, బగాది రాజారావు, మదనాల సింహాచలం, పి.బాలు ఉన్నారు.

గౌతు కుటుంబంపై విమర్శలు తగదు

హరిపురం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు కార్గో ఎయిర్‌ పోర్టును అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే గౌతు శిరీష కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు తగదని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బావన దుర్యోధన అన్నారు. మందస మండలం హరిపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ సమయంలో గౌతు కుటుంబం వెయ్యి ఎకరా ల భూమి కొనుగోలు చేసినట్టు వైసీపీ నాయకుడు బత్తిన లక్ష్మీనారాయణ ఆరో పించడం తగదన్నారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు తమరి భాస్కరరావు, మంగళిపాత్రో, రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, బమ్మిడి కర్రయ్య తులసీరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:09 AM