Share News

అంబేడ్కర్‌ సిద్ధాంతాలతోనే సుస్థిర సాధికారిత

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:39 PM

:రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలు, సిద్ధాంతాలతోనే సుస్థరమైన సాధికారిత సాధించగలమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూని వర్సిటీ సోషల్‌ వర్క్‌ విభాగం బీవోఎస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ పి. అర్జున్‌ తెలిపారు.వర్సిటీలో సోష ల్‌వర్క్‌, అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం సంయుక్తంగాజాతీయ సామాజిక శాస్త్రాల పరిశోధన మండలి- దక్షిణ ప్రాంతీయకేంద్రం (ఐసీ ఎస్‌ఎస్‌ ఆర్‌- ఎస్‌ఆర్‌సీ) హైదరాబాద్‌ సహకారంతో విస్మరించిన వర్గాలకు సాధికారిత- సామాజిక పని విలువలపై రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సెమినార్‌ మంగళవారంతో ముగిసింది.

అంబేడ్కర్‌ సిద్ధాంతాలతోనే సుస్థిర సాధికారిత
మాట్లాడుతున్న అర్జున్‌:

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యో తి):రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలు, సిద్ధాంతాలతోనే సుస్థరమైన సాధికారిత సాధించగలమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూని వర్సిటీ సోషల్‌ వర్క్‌ విభాగం బీవోఎస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ పి. అర్జున్‌ తెలిపారు.వర్సిటీలో సోష ల్‌వర్క్‌, అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం సంయుక్తంగాజాతీయ సామాజిక శాస్త్రాల పరిశోధన మండలి- దక్షిణ ప్రాంతీయకేంద్రం (ఐసీ ఎస్‌ఎస్‌ ఆర్‌- ఎస్‌ఆర్‌సీ) హైదరాబాద్‌ సహకారంతో విస్మరించిన వర్గాలకు సాధికారిత- సామాజిక పని విలువలపై రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సెమినార్‌ మంగళవారంతో ముగిసింది.ఈసందర్భంగా ఆయన అంబేడ్కర్‌ తాత్విక దృక్కోణం, సామాజిక న్యాయం, సోషల్‌ వర్క్‌ విలువలు తదితర అం శాలను ప్రస్తావించారు. వీసీప్రొఫెసర్‌ కేఆర్‌ రజని మాట్లాడుతూ సమాజంలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకుని వాటి పరిష్కారంలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.సుజాత, రాష్ట్ర మానవ హక్కుల ఫోరం ప్రధాన కార్యదర్శి వీఎస్‌ కృష్ణ, బెజ్జిపురం యూత్‌క్లబ్‌ డైరెక్టర్‌ ఎం.ప్రసాదరావు, సెమినార్‌ కన్వీనర్‌ డాక్టర్‌ యు.కావ్యజోత్స్న, కోకన్వీనర్‌ డి.వనజ పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:40 PM