యువకుడి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:00 AM
నగరానికి చెందిన బలగ సాయి (25) ఎచ్చెర్ల మండలం కాళింగ పేట గ్రామ సమీపంలో నాగావళి నదిలో శవమై తేలిన ఘటన చోటు చేసుకుంది.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): నగరానికి చెందిన బలగ సాయి (25) ఎచ్చెర్ల మండలం కాళింగ పేట గ్రామ సమీపంలో నాగావళి నదిలో శవమై తేలిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలి పిన వివరా లిలా ఉన్నాయి.. నగరంలోని మంగువారితోటకు చెందిన బలగ సాయి కుటుంబ సభ్యులతో వెల్డింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి బయటకు వెళతా నని చెప్పి కుటుంబ సభ్యులతో చెప్పి ఎప్పటికీ రాలేదు. దీంతో ఫోన్ చేసినా స్పందించకపోవ డంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎచ్చెర్ల మండలం కాళింగపేట నాగావళి తీరం వద్ద గుర్తు తెలియని మృతదేహం స్థానికులకు కనిపించడంతో వారు ఎచ్చెర్ల పోలీసులకు సమాచారమిచ్చారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ఒంటిపై ఉన్న దుస్తులు, శరీర ఆకృతిని చూసి బలగ సాయిగా గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సాయి మద్యం సేవించి ఆదివారంరాత్రి వరకు ఓయువతితో వీడియో కాల్‌లో మాట్లాడినట్టు, అనంతరం ఏం జరిగిందోగాని నది లో శవమై కనిపించి నట్టు పోలీసులు తెలిపారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
పాముకాటుతో వృద్ధురాలు..
నందిగాం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): బోరుభద్ర గ్రామానికి చెందిన తిర్లంగి అమ్మన్న (68) అనే వృద్ధురాలు పాముకాటుకు గురై మంగళవారం మృతి చెందింది. ఎస్‌ఐ షేక్‌మహ్మద్ ఆలీ వివరాల మేరకు.. గతనెల 27న తన ఇంటి పెరట్లోని బాత్‌రూమ్‌లోకి వెళ్లిన అమ్మన్నను పాముకాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆమెను టెక్కలి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అమ్మన్న పెద్ద కుమార్తె బమ్మిడి జయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అమ్మన్నకు దివ్యాంగుడైన కుమారుడు మల్లేశ్వరరావు ఉన్నాడు.