సమస్యలు పరిష్కరించాలని సర్వేయర్ల నిరసన
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:03 AM
గ్రామ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్క రించాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేశారు.
నరసన్నపేట/ పలాసరూరల్/ జలుమూరు/ పాతపట్నం/ నందిగాం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): గ్రామ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్క రించాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నరసన్నపేట, పలాస, జలుమూరు, పాతపట్నం, నందిగాం మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని, సీనియార్టీ జాబితా విడుదల చేయాలన్నారు. సొంత మండలాలకు బదిలీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలను అందిం చారు. కార్యక్రమాల్లో గ్రామ సర్వేయర్లు శరత్, రామచంద్రరావు, కె.ఉదయ్‌కిరణ్, అనిల్, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.