కార్మిక వర్గాల అభ్యున్నతికి ‘సురవరం’ విశేష కృషి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:48 PM
తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతానికి జీవి తాంతం కట్టుబడి పనిచేసి కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్య దర్శి జేవీ సత్యనారాయణ అన్నారు.
గుజరాతీపేట, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతానికి జీవి తాంతం కట్టుబడి పనిచేసి కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్య దర్శి జేవీ సత్యనారాయణ అన్నారు. స్థానికంగా మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ మంగళవారం నిర్వహించారు. సురవరం చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిజం భావాలకు ఆకర్షితుడై జీవి తాంతం వాటినే అనుసరిస్తూ దేశంలోని అనేక పోరాటాల్లో కీలకపాత్ర వహించారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, వివిధ సంఘాల నాయకులు ఎం.యుగంధర్, కె.మోహనరావు, ఎల్.వెంకట రావు, చాపర సుందర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.