అభాగ్యులను ఆదరించండి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:46 PM
సమాజం లో నిరాదణకు గురైన అభాగ్యులను ఆదరిం చాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్ డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సమాజం లో నిరాదణకు గురైన అభాగ్యులను ఆదరిం చాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. గురువారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బ్యాంకుల అధికారులతో సంస్థ కార్యాల యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, అనాథాశ్రమాల్లో ఉండే వారిపై కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వైద్యం అందించడంతో పాటు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవాలన్నారు. సమావే శంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మంత్రి వెంకటస్వామి, వావిలపల్లి జగన్నాథం నాయుడు, బి.రమేష్, టి.అప్పల నాయుడు, ప్రసాద్, గేదల ఇందిరాప్రసాద్ పాల్గొన్నారు.