Share News

పోస్టల్‌ బాధితులను ఆదుకోండి

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:06 AM

ఇ చ్ఛాపురం పోస్టల్‌ కార్యాలయంలో రూ.2.86 కోట్లు భారీ స్కాం జరి గిందని, తాము దాచుకున్న డబ్డులను ఇప్పించాలని ఆదుకోవాలని పలువురు బాధితులు కోరా రు.

పోస్టల్‌ బాధితులను ఆదుకోండి
ఎమ్మెల్యే అశోక్‌కు వినతి పత్రం అందిస్తున్న బాధితులు

ఇచ్ఛాపురం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇ చ్ఛాపురం పోస్టల్‌ కార్యాలయంలో రూ.2.86 కోట్లు భారీ స్కాం జరి గిందని, తాము దాచుకున్న డబ్డులను ఇప్పించాలని ఆదుకోవాలని పలువురు బాధితులు కోరా రు. శనివారం రామయ్యపుట్టుగంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను కలిసి వినతి పత్రం అందించారు. మేం సేవింగ్‌ చేసిన సొమ్ములు ఇవ్వాలని అనేక పర్యాయా లు సంబంధిత అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీను, దేవేంద్ర, ప్రశాంత్‌కుమార్‌, జ్యోతిసాయి తదితరులు పాల్గొన్నారు.

సోంపేట రూరల్‌: మాకన్నపురానికి చెందిన చిత్రాడ రమేష్‌ కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగులేకపోవడంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు రూ.1.19 లక్షలు మంజూరయ్యాయి. శనివారం చెక్కును ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ బాధితుడి తండ్రి బాబూరావుకు అందించారు.

Updated Date - Nov 23 , 2025 | 12:06 AM