నా సినిమాను ఆదరించండి
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:59 PM
యూనివర్సిటీ సినిమాను ఆదరించాలని పీపుల్స్‌స్టార్ ఆర్. నారాయణమూర్తి కోరారు.
పలాస, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీ సినిమాను ఆదరించాలని పీపుల్స్‌స్టార్ ఆర్. నారాయణమూర్తి కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ ట్రేడ్ ప్ర మోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావును కలుసుకొని తన సినిమాను చూడాలని ఈ సంద ర్భంగా కోరారు. విద్యారంగంలో జరుగుతున్న దోపిడీని తన చిత్రం ద్వారా ప్రశ్నించానని, ప్రజలు ఆదరించాలని కోరారు.