Share News

కేజీబీవీ విద్యార్థిని కుటుంబానికి అండ

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:52 PM

పాఠశాల భవనంపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన లోలు గు గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యా ర్థిని సీహెచ్‌ వందన కుటుంబాన్ని ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయ పాటి శైలజ హామీ ఇచ్చారు.

కేజీబీవీ విద్యార్థిని కుటుంబానికి అండ
విద్యార్థినిని పరామర్శిస్తున్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శైలజ

పొందూరు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పాఠశాల భవనంపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన లోలు గు గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యా ర్థిని సీహెచ్‌ వందన కుటుంబాన్ని ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయ పాటి శైలజ హామీ ఇచ్చారు. ఈ మేర కు బుధవారం విద్యార్థినిని పరామర్శిం చి ఘటనపై వివరాలను అడిగి తెలుసు కున్నారు. కేజీబీవీలో విద్యార్థినులపై సిబ్బంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నిం చారు. పాఠశాలలో జరిగే ప్రతీ ఘటనకు ప్రిన్సిపాల్‌, సిబ్బందిదే బాధ్యత అని అన్నారు. ఆమె పూర్తిగా కోలుకునేంతవరకు అండగా ఉంటామన్నారు. విద్యార్థినుల పట్ల జాగ్రత్తగా ఉండాల ని కేజీ బీవీ ప్రిన్సిపాల్‌ లలితకు సూచించారు. విద్యార్థిని సమస్యను, ఆమె కుటుంబ పరిస్థితిని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును ఎస్‌ఐ వి.సత్యనారాయణ, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:53 PM