కుల సంఘాల అభివృద్ధికి సహకారం: శంకర్
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:15 PM
రాష్ట్రంలో ప్రతి ఒక్క కుల సంఘం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
గార రూరల్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి ఒక్క కుల సంఘం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అంపోలు పంచాయతీ పరిధి లో ఉన్న జిల్లా జైలు రోడ్డు దారిలో రూ.40 లక్షలో నిర్మించ నున్న వెలమ సంక్షేమ సంఘం నూతన భవన నిర్మా ణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరమైన సహాయ సహకరారాలు అందిస్తానన్నారు. కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, వైసీపీ యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, అంపోలు మాజీ సర్పంచ్ గొండు వెంకటరమణమూర్తి, పలువురు వెలమ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.