పాడిరైతులకు సహకారం
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:15 AM
పాడిరైతులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు.
కవిటి, జూలై 6(ఆంధ్రజ్యోతి): పాడిరైతులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. రామయ్యపుట్టుగలో పాడిరైతులకు పశుసంవర్ధక శాఖ ద్వారా అందించే సబ్సిడీ పశుదాణాను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాడిరైతులకు సహకారం అందించే దిశగా ప్ర భుత్వం నిధులు వెచ్చించి వారి అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. పాడి రైతులకు సగం ధరకే దాణాను అందిస్తున్నామన్నారు. రైతులు పశుసంవర్థక శాఖ ద్వారా లబ్ధిపొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్, పీఏసీఎస్ అధ్యక్షుడు వాసుదేవ్ ప్రదాన్, నేతలు బి.రమేష్, పి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.