Share News

సామర్థ్యాల మెరుగుతోనే విజయాలు సాధ్యం

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:25 PM

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, సామర్థ్యాలను మెరుగు పరచుకుంటేనే విజయాలు సొంతం చేసుకోవచ్చని జిల్లా ఉపా ధి కల్పనాధికారి కె.సుధ అన్నారు.

సామర్థ్యాల మెరుగుతోనే విజయాలు సాధ్యం
విజేతలకు బహుమతులు అందిస్తున్న అధికారులు

జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధ

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, సామర్థ్యాలను మెరుగు పరచుకుంటేనే విజయాలు సొంతం చేసుకోవచ్చని జిల్లా ఉపా ధి కల్పనాధికారి కె.సుధ అన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు క్రీడల ద్వారా ఆరోగ్యం, శారీరక ధారుడ్యం పెంచేందుకు బుధవారం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. మేరా యువ భారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.వెంకట్‌ ఉజ్వల్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం ఆనందంగా ఉందని, క్రీడలపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తు న్నాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందిం చారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్‌ బాబు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్‌.నారాయణరావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్‌, సెట్‌శ్రీ సీఈవో వీవీ అప్పనాయుడు, డి.శ్రీనివాసరావు, శిక్షకులు మణి, సింహాచలం, హరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:25 PM