నైతిక విలువలతో సాధన చేస్తే విజయం
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:52 PM
మనిషి జీవితం లో సంకల్పం, నైతిక విలువలతో సాధన చేస్తే విజయం సాధించవచ్చని ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు అన్నారు.
రణస్థలం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మనిషి జీవితం లో సంకల్పం, నైతిక విలువలతో సాధన చేస్తే విజయం సాధించవచ్చని ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు అన్నారు. బుధ వారం ఎన్‌ఈఆర్ ఎక్స్‌లెన్స్ స్కూల్‌లో వివిధ అంశాలపై విద్యార్థులకు అవగామన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి నుంచే సంకల్పంతో ముందు కు సాగాలన్నారు. వివిధ రంగాల్లో రాణించిన వారు గట్టి సంకల్పవాదులుగా అభిప్రాయపడ్డారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అబ్దుల్‌కలాం, సచిన్ టెండుల్కర్ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు. చదువైనా, క్రీడ లైనా, మరో రంగమైనా సంకల్పం బలమే నిలబెడుతుంద న్నారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ఓ అంఽధ క్రికె ట్ క్రీడాకారిణి గురించిన వచ్చిన కథనం స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 ఏళ్ల పాంగి కరుణకుమారి అంధుల క్రికెట్‌లో ప్రపంచకప్ గెలిచిన ఇండి యన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఆమె తన 15 ఏళ్ల ప్రయాణంలో అనేక కష్టాలను ఎదురీది అనుకున్నది సాధించగలిగారన్నారు. ఇటువంటి కథనాల ద్వారా ప్రతి ఒక్క రూ స్ఫూర్తిపొందాలన్నారు. విద్యా ర్థులు సత్ప్రవర్తన, నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు, ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ, స్కూల్ డైరెక్టర్ నడుకుదిటి తేజాబాబు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.