Share News

లక్ష్యసాధనతోనే విజయం

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:43 PM

లక్ష్యసాధన దిశగా యువత కష్టపడితే విజయం వరిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

లక్ష్యసాధనతోనే విజయం
నియామక పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): లక్ష్యసాధన దిశగా యువత కష్టపడితే విజయం వరిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఆదివారం ఆర్ట్స్‌ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ జాబ్‌ మేళాలో 3,264 మంది అభ్యర్థులు హాజరుకాగా, 762 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. వీరికి ఎమ్మెల్యే గొండు శంకర్‌ నియామక పత్రాలను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కణిత శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధిసంస్థ అధికారి ఉరిటి సాయికుమార్‌, జిల్లా ఉపాఽధి అధికారిణి కె.సుధ, డీపీఆర్వో కె.బాలమాన్‌సింగ్‌, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దాసునాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షుగు మాధవరపు వెంకటేష్‌, కూటమి నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే పెద్దమార్కెట్‌ వద్ద వర్తక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యాక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌ పాల్గొన్నారు. కార్యాక్రమంలో వర్తక సంఘ అధ్యక్షుడు కోరాడ హరగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:43 PM