పారిశ్రామికవేత్తలకు రాయితీలు: ఏడీ
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:52 PM
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ జి. రవికుమార్, జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ పీవీ రఘునాథ్ తెలిపారు.
నరసన్నపేట, జూన్ 26(ఆంరఽధజ్యోతి): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ జి. రవికుమార్, జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ పీవీ రఘునాథ్ తెలిపారు. గురువారం నరసన్నపేటలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ సంయుక్తంగా ఎంఎస్‌ఎంఈలపై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి రాయితీలతో పాటు తక్కువ వడ్డీతో రాష్ట్ర ఫైౖనాన్స్ కార్పొరేషన్ రుణ సదుపాయం కల్పిస్తుందని తెలి పారు. కార్యక్రమంలో జామి వెంకట్రావు, ఉణ్న వెంకటేశ్వరరావు, తంగుడు జోగారావు, పట్నాన నాగేశ్వరరావు, రమణ సాహు, బోయన బాలకృష్ణ పాల్గొన్నారు.