ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:00 AM
చిలకపాలెం వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు.
ఎచ్చెర్ల, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): చిలకపాలెం వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చిలక పాలెం పంచాయతీ మునిపేటకి చెందిన కుప్పిలి మనోజ్ (12) అల్లినగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతిలో చదువుతున్నాడు. సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు రోజూ కాలినడకన లేదా ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయిస్తుంటాడు. ఇదే క్రమంలో శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు చిలకపాలెం జంక్షన్‌లో వేచి ఉండగా, అదే పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపా ధ్యాయులు వెళ్తున్న ఆటోలో తోటి విద్యార్థులు మరో నలుగురితో కలిసి ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లే సరికి ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటోలో బేబీ సీటులో కూర్చొన్న మనోజ్ రోడ్డుపైకి తుళ్లిపోయి పడిపోగా, ఆటో ఆ విద్యార్థిపై బోల్తాప డింది. తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్య లో మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో విద్యార్థిని కె.తనుశ్రీ (9వ తరగతి) గాయపడి శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతు డి తండ్రి ప్రకాష్ కార్పెంటర్ కాగా, తల్లి సరస్వతి గృహిణి. ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
జింకిభద్ర పాఠశాల హెచ్‌ఎం..
సోంపేట, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): జింకిభద్ర పాఠశా ల హెచ్‌ఎం చింతామణి దేవి పాడి(53) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బారువ గ్రామానికి చెందిన చింతామణి ఇటీవల పదోన్నతి పొంది జింకిభద్ర పాఠశాలలో హెచ్‌ఎంగా చేరారు. ప్రతిరోజూ స్వగ్రామం నుంచి పాఠశాలకు వెళుతుంటారు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా పాఠశాలకు బస్సులో వెళుతున్నారు. అయితే జింకిభద్రలో బస్సు దిగుతూ కింద పడిపోయారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను సోంపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలిస్తుంగా మార్గమధ్యలో మృతిచెందారు. సోంపేట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈమె అవివాహితురాలు. మృతురాలికి తండ్రి, ఇద్దరు సోదరీలు, ఒక సోదరుడు ఉన్నారు.
చెరువులో పడి వ్యక్తి..
టెక్కలి/రూరల్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): పెద్దరోకళ్లపల్లి పంచాయతీ రామనగరం గ్రామా నికి చెందిన బి.రామన్న(37) అనే వ్యక్తి శుక్రవా రం గ్రామంలోని చెరువులో జారిపడి మృతిచెం దాడు. గ్రామ స్థులు, పోలీసులు తెలిపిన వివరా ల మేరకు చెరువులోకి దిగే క్రమంలో రామన్న ప్రమాదవశాత్తు జారిపోవడంతో మృతి చెందా డు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీ లించారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా కేంద్రా సుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అందించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. రామన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.