విద్యార్థికి స్కబ్ టైఫస్ వ్యాధి
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:08 AM
కడుము వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న జి.ఈశ్వర్ స్కబ్ టైఫస్ వ్యాధి సోకిందని కేజీహెచ్ వైద్యులు నిర్ధా రించారని కురిగాం ఆసుపత్రి వైద్యాధికారి పెద్దిన ప్రస న్నకుమార్ తెలిపారు.
కొత్తూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కడుము వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న జి.ఈశ్వర్ స్కబ్ టైఫస్ వ్యాధి సోకిందని కేజీహెచ్ వైద్యులు నిర్ధా రించారని కురిగాం ఆసుపత్రి వైద్యాధికారి పెద్దిన ప్రస న్నకుమార్ తెలిపారు. బుధవారం కడుము వసతి గృ హాన్ని ఎంపీడీవో వి.నీరజతో పాటు వైద్య బృందం చేరు కొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవ ల అస్వస్తతకు గురైన ఈశ్వర్‌ను చికిత్సకోసం కేజీహెచ్ కు తరలించడంతో విషయం బయటపడింది. దీంతో కే జీహెచ్ వైద్యులు సలహామేరకు వసతి గృహం పరిసరా లను శానిటేషన్ చేయించినట్టు తెలిపారు. ఇతర విద్యా ర్థులు అస్వస్తతకు గురికాకుండా ఉండేలా వార్డెన్‌కు ప లు సూచనలను చేసినట్టు తెలిపారు. ఈ వ్యాధి సోకి నవారు జిల్లాలో నాలుగురు ఉన్నట్టు ఉన్నత అధికారు లు గుర్తించారన్నారు. ఈ వ్యాధి గాలిద్వారా వ్యాప్తి చెందదని, వ్యాధికి గురైన వారి శరీరంపై పుండ్లు ఉంటే అవి చిదిగడం ద్వారా ఇతరులకు అంటుకునే ప్రమాదం ఉందన్నారు.