ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:51 PM
Swarnandhra-Swachhandhra program ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జమ్ము గ్రామంలో పరిసరాలను పరిశీలించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
నరసన్నపేట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జమ్ము గ్రామంలో పరిసరాలను పరిశీలించారు. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసే విధానంపై మహిళలకు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పెరటిలో చెట్లను నాటి... వాటి సంరక్షణ బాఽధ్యతను ఇంటి పెద్దపేరుతో తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాఠశాలలో సరస్వతి విగ్రహానికి పూలమాల వేసి... విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చేతులు శుభ్రం చేసుకునే విధా నంపై అవగాహన కల్పించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలో తడిచెత్త, పొడిచెత్త సేకరణ తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీలు... పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు గ్రామమంతా పరిశుభ్రంగా ఉండటం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మును ఆదర్శంగా తీసుకొని.. మిగతా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని డీపీవో భారతీ సౌజన్యకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పోగోటి ఉమామహేశ్వరి, కాళింగ, పొందరి కార్పొరేషన్ల చైర్మన్లు రోణంకి కృష్ణంనాయుడు, దామోదరం నర్సింహ, శిమ్మ చంద్రశేఖర్, గొద్దు చిట్టిబాబు, కత్తిరి వెంకటరమణ,జ ామి వెంకట్రావు, బోయిన సతీష్, ఎమ్పీడీవో వెంకటేష్ ప్రసాద్, నిశ్చల, డిప్యూటీ ఎమ్పీడీవో రమేష్, ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పి.దాలినాయుడు, ఐసీడీఎస్ పీవో శోభారాణి, సర్పంచ్ వాన గోవిందరాజులు, రెడ్డి సతీష్ పాల్గొన్నారు.