Share News

పకడ్బందీగా ధాన్యం కొనుగోలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:46 PM

To speed up grain procurement జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పకడ్బందీగా ధాన్యం కొనుగోలు
మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

పనితీరు మెరుగుపడని కేంద్రాలు రద్దు చేస్తాం

నిర్లక్ష్యం చూపే అధికారులకు షోకాజ్‌ నోటీసులు

జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా ఉండడంపై అసంతృప్తి చెందారు. జలుమూరులో కనీసం ఒక్క ట్రక్‌షీట్‌, ఎఫ్‌టీఓ కూడా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో ధాన్యం సేకరణ నెమ్మదిగా జరుగుతోందని, పనితీరు మెరుగుపరచుకోవాలని స్పష్టం చేశారు. పనితీరు బాగోలేని కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ పథకాల అమలులో ర్యాంకులు మెరుగుపరచుకోవాలని తెలిపారు. ‘అన్న క్యాంటీన్‌ల పనితీరులో ప్రస్తుతం 18వ ర్యాంకులో ఉన్నాం. దీనిని మెరుగుపరచాలి. భోజనాల నాణ్యత, పరిసరాలు, ప్లేట్‌ల పరిశుభ్రత, సమయపాలన విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్టీసీ విభాగంలో 8వ ర్యాంకు నుంచి ఒకటో స్థానానికి చేరుకునేలా అధికారులు కృషి చేయాలి, ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా 5వ స్థానంలో ఉన్నా, సరుబుజ్జిలి వంటి ప్రాంతాల్లో బాగా వెనుకబడి ఉంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రీవెన్స్‌లో అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి. పంచాయతీరాజ్‌, డీఆర్డీఏ, డ్వామా, డీఈఓ, రూరల్‌ ఎస్‌ఐ వంటి శాఖల్లో ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత లేదు. ఎండార్స్‌మెంట్‌ ఈ విషయంలో పొరపాట్లను సహించేది లేదు. నిర్లక్ష్యం చూపే అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తాం. పారిశుద్ధ్యం విషయంలో అధికారులు మరింత పకడ్బందీగా పనిచేయాల’ని తెలిపారు.

Updated Date - Nov 25 , 2025 | 11:47 PM