పారిశుధ్యం లోపిస్తే కఠిన చర్యలు: రవికుమార్
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:11 AM
పట్టణంలో పారిశుధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు.
ఆమదాలవలస, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో పారిశుధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం వేకువజామున పట్టణంలోని 16, 17, 14, 2, 12, 13 వార్డుల్లో ద్విచక్రవాహనంపై ‘హలో గుడ్‌మార్నింగ్’ అంటూ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా స్థానికు లతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని తక్షణం పరిష్క రించాలని మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవిని ఆదేశించారు. కండ్రపేట, శివన్నారాయణ క్వార్టర్స్, పూజారిపేట, ఐజే నాయు డుకాలనీ, కృష్ణాపురంతో పాటు పట్టణ ప్రధాన మార్గా ల్లో స్కూటీపై ప్రయాణించి పట్టణ పరిశుభ్రతపై అవగాహన కలి గించారు. రోడ్లపై ఉన్న దుకాణదారులు దుకాణాల ముందు పెద్ద డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం తగదన్నారు. జూనియర్ కళాశాల ఎదుట ఎటువంటి దుకాణాలను ఏర్పా టు చేయకుండా నిరోధించాలని, కోర్టు ఎదురుగా ఉన్న దుకా ణాలను తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. పోలీ స్ స్టేషన్ ఎదురుగా రోడ్లపై ఉంచిన ఇసుక, ఇటుకలను తక్షణం తొలగించాలని సచివాలయ శానిటరీ సెక్రటరీకి ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీవీ వీకే రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ కూన అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.