Share News

అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు

ABN , Publish Date - May 06 , 2025 | 11:57 PM

సామాజిక మాధ్యమాల వేదికగా ఇతరుల ను కించపరిచేలా అసభ్యకరమై న, అనైతిక, అవమానకర రీతి లో పోస్టులు పెడితే చట్టపరమై న కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించా రు.

అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు
జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నఎస్పీ మహేశ్వరరెడ్డి

  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, మే 6(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల వేదికగా ఇతరుల ను కించపరిచేలా అసభ్యకరమై న, అనైతిక, అవమానకర రీతి లో పోస్టులు పెడితే చట్టపరమై న కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించా రు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అన్ని పోలీస్‌ స్టేషన్ల అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సోషల్‌ మీడియా, సైబర్‌ కేసుల నమోదు, దర్యాప్తు, అరెస్టు, ఆర్థిక సైబర్‌ నేరాల్లో పోగొట్టుకున్న నగదు తదితర అంశాలపై అదనపు ఎస్పీ కె.వి.రమణతో కలిసి సమీక్షించారు. సైబర్‌ నేరాల దర్యాప్తులో మెల కువలు, అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ని ఘా, అరెస్టు, తీసుకోవాల్సిన చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే పద్ధతిపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సామాజిక మాధ్యమా ల్లో వ్యక్తుల పైన, సంస్థలపైన హేయమైన, అసత్య ప్రచారా లు, అవమానకరమైన పదజాలంతో ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేయడం, ట్రోలింగ్‌, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేసినవారిపై కేసు నమోదు చేయాల న్నారు. సైబర్‌ కేసులు ఛేదించడంలో ప్రతి అం శాన్నీ కీలకంగా చూడాలన్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో బాధిత వ్యక్తులు పోగొట్టుకున్న నగదు ను గోల్డెన్‌ అవర్‌లో ఫ్రీజ్‌ చేయించి... తిరిగి అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Updated Date - May 06 , 2025 | 11:57 PM