Share News

ఆలయాల భద్రతకు పటిష్ఠ చర్యలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:45 AM

ఆలయాల భద్రతకు కూటమి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ ఎన్‌ మాధవ్‌ అన్నారు.

ఆలయాల భద్రతకు పటిష్ఠ చర్యలు
క్షతగాత్రుడితో మాట్లాడుతున్న బీజేపీ నేతలు మాధవ్‌, సమీఎం రమేష్‌

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

పలాస/రూరల్‌/కాశీబుగ్గ నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆలయాల భద్రతకు కూటమి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ ఎన్‌ మాధవ్‌ అన్నారు. ఆదివారం ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి ఘటన జరిగిన వేంకటేశ్వరస్వా మి ఆలయాన్ని పరిశీ లించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టికర మన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆలయా లపై ప్రభుత్వం ఒక పాలసీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంద న్నారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన ఆవశ్యకతపై ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుం బాలకు రూ.రెండు లక్షల చొప్పున అందించినట్టు తెలిపారు. అనంత రం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్షించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు, పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదిరి, బీజేపీ జిల్లా అధ్యక్షడు ఎస్‌.తేజేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 12:45 AM