Share News

బీట్‌ వ్యవస్థను పటిష్ఠంచేయండి: ఎస్పీ

ABN , Publish Date - May 01 , 2025 | 11:45 PM

రాత్రి సమయంలో గస్తీవిధులను పకడ్బందీ గా నిర్వహించి బీట్‌ వ్యవస్థను పటి ష్ఠం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు.

బీట్‌ వ్యవస్థను పటిష్ఠంచేయండి: ఎస్పీ
రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి:

ఎచ్చెర్ల,మే 1(ఆంధ్రజ్యోతి): రాత్రి సమయంలో గస్తీవిధులను పకడ్బందీ గా నిర్వహించి బీట్‌ వ్యవస్థను పటి ష్ఠం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు.గురువారం ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహిం చారు. ముఖ్యమైన రికార్డులు, వివిధ కేసుల దర్యాప్తు, నాన్‌ బెయిల్‌ వారెం ట్‌ల వివరాలపై ఆరాతీశారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ గ్రామాలను సందర్శించి అల్లర్లు, ఘర్షణలు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు. గ్రామస్థులతో మమేకమై శాంతియుత వాతావ రణం నెలకొనేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టాలని తెలిపారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజూ గ్రామాలను సందర్శించి మహిళలు, చిన్నారులు సంబంధిత నేరాలు, మాదక ద్రవ్యాలు నియంత్రణ, సైబర్‌ నేరాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, శక్తి యాప్‌పై విస్తృత ప్రచారం చేపట్టాల ని కోరారు. ఆయన వెంట ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - May 01 , 2025 | 11:45 PM