Share News

Ycp coruptions: వైసీపీ దొంగలను నిలదీయండి

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:43 AM

Distribution of widow pensions గడిచిన ఐదేళ్లలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయకుండా.. ఇప్పుడు ‘బాబు ష్యూరిటీ... మోసం గ్యారంటీ’ పేరుతో వైసీపీ దొంగలు అసత్య ప్రచారాలు చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నారు. అలాంటి వారిని ప్రజలు నిలదీయాల’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Ycp coruptions: వైసీపీ దొంగలను నిలదీయండి
బమ్మిడి లచ్చమ్మకు వితంతు పింఛన్‌ను అందజేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి అచ్చెన్నాయుడు

  • నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లు పంపిణీ

  • నేడు రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమ

  • కోటబొమ్మాళి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గడిచిన ఐదేళ్లలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయకుండా.. ఇప్పుడు ‘బాబు ష్యూరిటీ... మోసం గ్యారంటీ’ పేరుతో వైసీపీ దొంగలు అసత్య ప్రచారాలు చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నారు. అలాంటి వారిని ప్రజలు నిలదీయాల’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళి మండలం చిట్టేవలస పంచాయతీ తులసిపేటలో శుక్రవారం ఆయన పర్యటించారు. సమస్యలు తెలుసుకున్నారు. నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లను పంపిణీ చేశారు. ‘ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. నాలుగేళ్లుగా పింఛన్‌ మంజూరు చేయాలని ఎందరినో వేడుకున్నాం. కానీ ఫలితం లేకపోయింది. ఇన్నాళ్లటికి తమకు వితంతు పింఛన్‌ మంజూరు కావడం ఎంతో ఆనందంగా ఉంద’ని బమ్మిడి లచ్చమ్మ, మెండ శాంతమ్మ, ఎండ మల్లమ్మ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 3.50లక్షల పింఛన్లు తొలగించారు. ఇందులో వితంతు పింఛన్లు 1.20 లక్షలు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 1.09 లక్షల మంది వితంతువులకు శుక్రవారం పింఛన్లు అందజేసింది. మిగిలిన వారికి త్వరలో అందజేస్తాం. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా హామీలను నెరవేరుస్తున్నాం. పింఛన్‌ పెంపు, ఉచిత సిలిండర్‌, తల్లికి వందనం పథకాలు అమలు చేశాం. అన్నక్యాంటీన్లు తెరిచాం. శనివారం అన్నదాత సుఖీభవ పథకం కిందట రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున తొలి విడత నిధులు జమ చేయనున్నాం. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామ’ని తెలిపారు. ఆరు నెలల్లో చిట్టేవలస పంచాయతీలో సీసీ రోడ్లు, తాగునీటి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌, తహసీల్దార్‌ ఆర్‌.అప్పలరాజు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీ నాయకులు వెలమల విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, కామేశ్వరరావు, బోయిన రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:43 AM