అభివృద్ధి దిశగా అడుగులు
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:28 PM
ము ఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలనలో గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణమూర్తి అన్నారు.
హిరమండలం, జూలై 26(ఆంధ్రజ్యోతి): ము ఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలనలో గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణమూర్తి అన్నారు. గులు మూరు గ్రామంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇం టింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తు న్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు, టీడీపీ నాయకులు కె.అప్పలరాజు, ఎస్.గోవింద, టి.అప్పన్న,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జలుమూరు (సారవకోట) జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం ఇంటింటా నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. బద్రి, బుడితి, చీడిపూడి గ్రామాల్లో శనివారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి, పథకాలపై ఇంటింటా వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాధు చిన్నికృష్ణంనాయుడు, బోర తాతయ్య, ఎస్.అప్పలనాయుడు, పిట్ట సింహాచలం, సోల ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.