రీ సర్వేలో సమస్యలు పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:37 PM
మెట్టూరు రెవెన్యూ పరిధిలోగల గునుపల్లిలో రీసర్వేలో ఉన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పలాస ఆర్డీవో జి.వెంకటేష్ పేర్కొన్నారు.
వజ్రపుకొత్తూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మెట్టూరు రెవెన్యూ పరిధిలోగల గునుపల్లిలో రీసర్వేలో ఉన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పలాస ఆర్డీవో జి.వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం గునుపల్లి సచివాలయంలో రీ సర్వేలోసమస్యలను అడిగితెలుసుకుని, అర్జీలను పరిశీలించారు. తనస్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, మిగిలిన వాటిపై జేసీతో మాట్లాతానని తెలి పారు. ఇటీవల గునుపల్లిలో ఎయిర్‌పోర్టు నిర్వాసితులతో సమావేశం నిర్వహించిన సమయంలో తమ భూముల్లో రీసర్వేపై అనేక సమస్యలు ఉన్నట్లు రైతులు తెలియ జేశారు. దీంతో గురువారం తహసీల్దార్ సీతారామ్మూర్తితో కలిసి రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సులో డీటీ శ్రావన్, ఆర్‌ఐ మనోహర్ పాల్గొన్నారు.