Share News

గిరి ప్రదక్షిణకు ఇబ్బందులు లేకుండా చర్యలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:36 PM

ఎందువ కైలాశేశ్వర గిరి ప్రదక్షిణ బుధవారం నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, ఆర్డీవో సాయి ప్రత్యూష సూచించారు.

గిరి ప్రదక్షిణకు ఇబ్బందులు లేకుండా చర్యలు
మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద

జి.సిగడాం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎందువ కైలాశేశ్వర గిరి ప్రదక్షిణ బుధవారం నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, ఆర్డీవో సాయి ప్రత్యూష సూచించారు. మంగళవారం గిరి ప్రదక్షిణ కొండ పరిసరాలను వారు వేర్వేరుగా పరిశీలించారు. అనంతరం నిర్వాహకులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణకు అధి క సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటు వంటి ఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టు కొని వారికి అవసరమైన సదు పాయాలు కల్పించాలని నిర్వాహ కులను కోరారు. కాశీబుగ్గ ఆలయం లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో గిరి ప్రదక్షిణ సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఆర్డీవో సాయి ప్రత్యూష మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని నియమిస్తున్నా మన్నారు. గిరి ప్రదక్షిణ, పరమేశ్వరుని దర్శించుకున్న భక్తులకు మార్గమధ్యంలో తాగునీరు, స్నాక్స్‌ అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ వై.మధుసూదన రావు, తహసీల్దార్‌ ఎం.సరిత, ఎంపీడీవో జి.రామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్‌, సర్పంచ్‌ అల్లు జోగి నాయుడు, గొలివి శ్రీనివాసరావు, నేతేటి రామకృష్ణ శర్మ, పలువురు నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:36 PM