క్రీడా వసతుల కల్పనకు చర్యలు: ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:30 PM
జిల్లాలో క్రీడాకారులకు అవసరమైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దని, ఇందులో భాగంగా పాత్రునివలస వద్ద 30 ఎకరాల్లో అన్ని క్రీడాం శాలను కలిపి క్రీడా హబ్‌గా తయారు చేసేందుకు సంకల్పించినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడాకారులకు అవసరమైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దని, ఇందులో భాగంగా పాత్రునివలస వద్ద 30 ఎకరాల్లో అన్ని క్రీడాం శాలను కలిపి క్రీడా హబ్‌గా తయారు చేసేందుకు సంకల్పించినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. తిరుపతిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ రికర్వ్ విభా గంలో విజేతగా నిలిచిన ఆరంగి కల్యాణ్‌ను ఆదివారం పార్టీ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కల్యాణ్ అవార్డును అందుకోవడం అభినందనీయమన్నారు. సీతం పేట వంటి ట్రైబల్ ప్రాంతాలకే పరిమితమైన అర్చరీ నేడు పట్టణం లో అర్జున అర్చరీ అకాడమీ క్రీడాకారులకు ప్రోత్సహించడం గొప్ప విష యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పీఎంజే బాబు, కోచ్ శ్రీని వాసరావు అర్చరీ అకాడమీ అధ్యక్షుడు ఎం.రమేష్, కార్యదర్శి చిట్టిబాబు, పి.కృష్ణప్రసాద్, ఓ.శ్రీనివాసరావు, పి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.