Share News

జామియా మసీద్‌ అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:41 PM

నగరంలోని పురా తన జామియా మసీదు అభివృద్ధికి నూతన వక్ఫ్‌ బోర్డు కమి టీ కృషి చేయాలని.. అందుకు అవసరమైన సహకారం అంది స్తానని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

జామియా మసీద్‌ అభివృద్ధికి చర్యలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్‌

శ్రీకాకుళం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నగరంలోని పురా తన జామియా మసీదు అభివృద్ధికి నూతన వక్ఫ్‌ బోర్డు కమి టీ కృషి చేయాలని.. అందుకు అవసరమైన సహకారం అంది స్తానని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. జామియా మసీద్‌ ప్రాంగణంలో ఆదివారం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మసీదు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించే పనులు తక్షణమే చేపడతామన్నారు. త్వరలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయు డు సహకారంతో సోలార్‌ ల్యాంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వక్ఫ్‌బోర్డు కమిటీ మత విశ్వా సాలను గౌరవించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో పలు మసీదుల ప్రతినిధులు, మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:41 PM