యూరియా పంపిణీకి చర్యలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:52 PM
యూరియా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టంచేశారు. మంగళవారం జిల్లాలోని పలుచోట్ల క్షేత్రస్థాయిలో అధికారులు అధికారులు పర్యటించారు. రసాయన ఎరువుల అధిక వినియోగించడం వల్ల నష్టాలను రైతులకు వివరించారు.
యూరియా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టంచేశారు. మంగళవారం జిల్లాలోని పలుచోట్ల క్షేత్రస్థాయిలో అధికారులు అధికారులు పర్యటించారు. రసాయన ఎరువుల అధిక వినియోగించడం వల్ల నష్టాలను రైతులకు వివరించారు.
ఫఎల్.ఎన్.పేట, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి) రైతులందరికీ యూరియా పంపి ణీచేసేందుకు శాఖాపరమైన చర్యలు చేపడతామని కొత్తూరు డివిజన్ అగ్రికల్చర్ ఏడీ బి. రాజగోపాల్ తెలిపారు. కృష్ణాపురంలో రైతులతో యూరియా పంపిణీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక దిగుబడి సాధించాలంటే రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, వీటితో భూసారం తగ్గిపోయి భవిష్యత్‌లో పంటలు పండించేందుకు వీలులేకుండా పోతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో కె. సింహా చలం, రెవెన్యూ కార్యదర్శి కె. జోగినాయుడు, బి. పద్మజ పాల్గొన్నారు.
ఫజలుమూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):యూరియా కోసం రైతులు ఆం దోళన చెందాల్సిన అవసరంలేదని, సరిపడ ఎరువులు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఏవో పి.అరుంధతిదేవి తెలిపారు. మంగళవారం మండలంలోని పాగోడు, కరవంజ గ్రామాల్లో గల రైతులకు యూరియావాడకంపై అవగాహన కల్పించారు. యూరియా రైతులు విచక్షణారహితంగా వాడకుండా వ్యవసాయాధికారులు సూచనలు పాటించాలని కోరారు.కార్యక్రమంలో తహసీల్దారు జె.రామారావు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఏవో కె.రవికుమార్ పాల్గొన్నారు.