Share News

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - May 27 , 2025 | 12:17 AM

గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్వ ప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు
అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • గ్రీవెన్స్‌కు 182 వినతులు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 26(ఆంధ్రజ్యోతి): గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్వ ప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వ హించిన గ్రీవెన్స్‌లో ఆయన జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చినవారి నుండి 186 అర్జీలను స్వీకరించారు. తొలుత శాఖల వారీగా పెండింగ్‌ లో ఉన్న అర్జీలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వానికి తావులేదని, ప్రభుత్వం అత్యంత ప్రాధన్యం ఇస్తోందని, అధికారులను తమ పరిధిలోని అర్జీలను స్వయంగా పరి శీలించి, క్షేత్రస్థాయిలో విచారించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరి ష్కారాన్ని చూపాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్‌ ఎం.పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దోబీఘాట్‌ను కూల్చేయొద్దు

తమకు జీవనోపాధి కల్పిస్తున్న రేవులో పార్కు నిర్మాణం కోసం దోబీఘాట్‌ను కూ ల్చవద్దని బలగకు చెందిన భద్రమ్మతల్లి రజక కుల సంక్షేమ సంఘ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి గేదెల పురు షోత్తం మాట్లాడుతూ.. పార్కును నిర్మిస్తే, దోబీఘాట్‌ను నమ్ముకుని జీవిస్తున్న వందల కుటుంబాలు ఉపాధి కో ల్పోతాయని, వరదల సమయంలో కులవృత్తి కష్టమవుతుం దన్నారు. దోభీఘాట్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి, తమ జీవానాధారాన్ని తొలగించడం సమంజసం కాదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

యాజమాన్యమే జీతాలు చెల్లించాలి

గత 20ఏళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తున్నామని, కానీ నేటికీ ఔట్‌ సోర్సింగ్‌ విధానంలోనే కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా యాజమాన్యమే జీతాలు చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సోమవారం గ్రీవెన్స్‌లో కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. థర్డ్‌పార్టీ కాంట్రాక్టర్లు కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ లు సక్రమంగా చెల్లించడం లేదని, ఈఎస్‌ఐ కార్డులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. జీతాల నుంచి అదనంగా రూ.1000 నుంచి రూ.3000 వరకు కార్మికుల దగ్గర నుంచి వసూలు చేసి శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికశాఖ నిబంధనలను తమకు వర్తింపజేయాలని, పండగ సెలవులు, మహిళలకు మెటర్నిటీ లీవులు కల్పించాలని, ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలని కోరారు.

Updated Date - May 27 , 2025 | 12:17 AM