సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటాలు
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:25 PM
సమస్యల పరిష్కారానికి దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర కోరారు.
అరసవల్లి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర కోరారు. సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం సంఘ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కేవలం రూ.3000 గౌరవ వేతనం ఇచ్చి రోజు మొత్తం పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని, నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, మెనూ చార్జీలను పాఠశాల విద్యార్థులకు రూ.20, కళాశాల విద్యార్థులకు రూ.30లకు పెంచాలన్నారు. స్మార్ట్ కిచెన్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వంటలకు అవసరమైన వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు టి.ప్రవీణ, బి.కన్యా కుమారి, జయలక్ష్మి, పద్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.