మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:37 PM
మాదక ద్రవాల విని యోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని వక్తలు పిలుపు నిచ్చారు.
ఎచ్చెర్ల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవాల విని యోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని వక్తలు పిలుపు నిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సూచనల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికో త్సవాన్ని మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని సమష్టిగా అడ్డుకోవాలనే నినాదంతో ‘సంకల్ప’ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థా లకు, వ్యసనాలకు దూరంగా ఉంటామంటూ విద్యార్థు లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫె సర్ బి. అడ్డయ్య, దివ్యాంగుల సంక్షేమశాఖ డీడీ బి.శైలజ, వర్సిటీ ప్రిన్సి పాళ్లు డాక్టర్ ఎం.అనూరాధ, డాక్టర్ సీహెచ్ రాజశేఖరరావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.వనజ తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో...
శ్రీకాకుళంలోని ఆర్జీకేయూటీ క్యాంపస్‌లో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా మంగ ళవారం సామూహిక ప్రతిజ్ఞ చేశా రు. కార్యక్రమంలో క్యాంపస్ డైరె క్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ, ఏవో డాక్టర్ ముని రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ పాల్గొన్నారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి..
ఆమదాలవలస, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌కు యువత బానిస కావద్దని, వీటికి దూరంగా ఉండాలని ప్రిన్సిపాల్ బి.శ్యాంసుం దర్ కోరారు. నాషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగం గా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కె. రాజారావు, జె.రవి తదితరులు పాల్గొన్నారు.