Share News

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:13 AM

మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్క రూ దూరంగా ఉండాలని ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ అన్నారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ యాసిన్‌

హిరమండలం, జూలై 6(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్క రూ దూరంగా ఉండాలని ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ అన్నారు. ఆదివారం సుభలయ గ్రామంలో ‘సంకల్పం’లో భాగంగా మాదక ద్రవ్యాల నివారణ, మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఎక్కువగా వ్యసనాలకు లోనవుతున్నారని, దీనివల్ల భవిష్యత్‌ అంధకా రంగా తయారవుతుందన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల నడవడికలను పరిశీలిస్తుండాలన్నారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jul 07 , 2025 | 12:13 AM