ఉత్సాహంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:10 AM
కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.
విజేతలుగా విజయనగరం, కడప
కోటబొమ్మాళి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బాలికల విభాగంలో విజయనగరం జిల్లా ప్రథమ, నెల్లూరు జిల్లా ద్వితీయ స్థానం సాధించాయి. బాలుర విభాగంలో కడప జిల్లా ప్రథమ, శ్రీకాకుళం ద్వితీయ స్థానం పొందాయి. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 12 బాలికల జట్లు, 21 పురుషుల జట్లు పాల్గొన్నాయి. విజేతలకు స్థానిక టీడీపీ నేతలు, ఆలయ కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు.
సంగిడి పోటీలు..
కొత్తమ్మతల్లి జాతరలో భాగంగా బుధవారం సంగిడి, ఈడుపురాయి, ఉలవల బస్తాలు ఎత్తే పోటీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో జరిగిన ఈ పోటీల్లో కోటబొమ్మాళి మండ లం నిమ్మాడ గ్రామానికి చెందిన ఆవాల గోవిందరావు ప్రథమ బహుమతి సాధించాడు. చింతువానిపేటకు చెందిన ఆవాల వసంతరావు, ఆవాల త్రినాఽఽథ్ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వీరికి గురువారం బహుమతులు అందజేయనున్నారు. న్యాయనిర్ణేతలుగా టీడీసీ సీనియర్ నాయకులు కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణరెడ్డి, శివకుమార్‌రెడి వ్యవహరించారు.
క్విజ్ పోటీ విజేతగా హరిపురం విద్యార్థులు
వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డోకులపాడులో బుధవారం జిల్లాస్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. హరిపురం గీతం స్కూల్ విద్యార్థులు విజేతగా నిలిచారు. ద్వితీయ, తృతీయ స్థానాలల్లో వరుసుగా హరిపురం, లోహరిబంద హైస్కూల్ విద్యార్ధులు నిలిచారు. మొత్తం 57 టీంలు పోటీలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు జ్ఞాపికలతో పాటు నగదు బహుమతులు అందించారు.