Share News

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు రాష్ట్రస్థాయి అవార్డుఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:49 PM

ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ (బాపట్ల జిల్లా) ఆధ్వర్యంలో నిర్వ హించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ కలర్‌ పోటీలో శ్రీకాకుళం ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ బి.జోగారావు విజేతగా నిలిచారు.

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు రాష్ట్రస్థాయి అవార్డుఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
అవార్డు వచ్చిన ఫొటో.. (ఇన్‌సెట్‌లో) జోగారావు

అరసవల్లి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ (బాపట్ల జిల్లా) ఆధ్వర్యంలో నిర్వ హించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ కలర్‌ పోటీలో శ్రీకాకుళం ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ బి.జోగారావు విజేతగా నిలిచారు. డాక్టర్‌ భగవాన్‌ దాస్‌ ఐఏఎస్‌, ఎఫ్‌పీఎస్‌ఏ, బండి రాజన్‌బాబు స్మారక 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో జోగారావు ప్రథమ బహుమతి పొందారని అకాడమీ ప్రతినిధి కె.సుధాకరరెడ్డి తెలిపారు. విజేతలకు త్వరలో బహుమతి ని అందజేస్తామని పేర్కొన్నారు. విజయనగరంలో 2003లో విద్యారంగ సమ స్యలపై ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరసనలో విద్యార్థినుల పట్ల పోలీసుల చర్యలపై తీసిన చిత్రానికి ఈ బహుమతి వచ్చింది.

Updated Date - Aug 19 , 2025 | 11:49 PM