Share News

సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:19 PM

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు అభి వృద్ధి వెనక్కి వెళ్లిందని, దానిని ప్రస్తుత కూట మి ప్రభుత్వం ఆధ్వర్యంలో పునర్నిర్మాణం దిశ గా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తు న్నారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం

ఆమదాలవలస, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు అభి వృద్ధి వెనక్కి వెళ్లిందని, దానిని ప్రస్తుత కూట మి ప్రభుత్వం ఆధ్వర్యంలో పునర్నిర్మాణం దిశ గా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తు న్నారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. శనివారం పట్టణంలోని 2, 12, 13, 14, 15, 16, 17 వార్డుల్లో చేపట్ట నున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుమారు రూ.71.74 లక్షల బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ ఎస్‌ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. ఆమదాలవలస గడచిన ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరు వాత మునిసి పాలిటీకి అధిక నిధులను తీసుకువచ్చి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మునిసి పల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతాసాగర్‌, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ మొదల వలస రమేష్‌, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, కమి షనర్‌ తమ్మినేని రవి, రాష్ట్ర మెడికల్‌ బోర్డు సభ్యుడు చాపర సుధాకర్‌, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తంగి శంకరరావు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 11:19 PM