Share News

రాష్ట్రస్థాయి క్రికెట్‌ విజేత ‘విశాఖ’

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:55 PM

స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌-19 రాష్ట్రస్థాయి పోటీల్లో భాగంగా స్థానిక కోడిరామ్మూర్తి స్టేడి యంలో బుధవారం క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. శ్రీకాకుళం, విశాఖ పట్నం మధ్య జరిగిన ఈ ఫైనల్‌ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది.

రాష్ట్రస్థాయి క్రికెట్‌ విజేత ‘విశాఖ’
విజేత జట్టుకు జ్ఞాపిక అందజేస్తున్న డీఈవో రవిబాబు

ద్వితీయస్థానంలో శ్రీకాకుళం జట్టు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌-19 రాష్ట్రస్థాయి పోటీల్లో భాగంగా స్థానిక కోడిరామ్మూర్తి స్టేడి యంలో బుధవారం క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. శ్రీకాకుళం, విశాఖ పట్నం మధ్య జరిగిన ఈ ఫైనల్‌ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. ఆతిథ్య జట్టు శ్రీకాకుళం ద్వితీయస్థానం పొందింది. ఫైనల్‌ పోటీ ఉత్తంఠభరితంగా సాగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విశాఖ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. శ్రీకా కుళం జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేయడంతో ఇరుజట్ల స్కో ర్లు సమమయ్యాయి. ఫలితం తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌కు అంపైర్లు నిర్ణయించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీకాకుళం జట్టు 7 పరుగులు చేయగా, తర్వాత విశాఖ జట్టు మూడు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. విజేతలకు డీఈవో ఎ.రవిబాబు విజేతలకు జ్ఞాపిక, పతకాలు అందజేశారు. పోటీలకు రాష్ట్ర పరిశీలకుడిగా రాజేష్‌ గోల, మ్యాచ్‌ నిర్వాహణాధికారులు ఎంవీరమణ, ఎం.ఆనంద్‌ కిరణ్‌, ఎ.డిల్లేశ్వరరావు, బి.లోకేశ్వర రావు, బి.మల్లేశ్వరరావు వ్యవహరించారు.

Updated Date - Nov 05 , 2025 | 11:55 PM