సిబ్బంది అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:04 AM
మొంథా తుఫాన్ నేపథ్యంలో అన్నిశాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు కోరారు.ఈ మేరకు సోమవారం తహసీల్దార్, మండల పరిషత్ కార్యాల యాల్లో సమీక్షించారు. పలు చోట్ల పర్యటించి ప్రజలను అప్రమత్తంచేశారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో అన్నిశాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు కోరారు.ఈ మేరకు సోమవారం తహసీల్దార్, మండల పరిషత్ కార్యాల యాల్లో సమీక్షించారు. పలు చోట్ల పర్యటించి ప్రజలను అప్రమత్తంచేశారు.
పాతపట్నం, అక్టోబరు 27(ఆంద్రజ్యోతి): మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ కోరారు.స్థానిక ఎంపీడీవో కార్యాల యంలోఅధికారులతో మొంథాతుపాన్‌పై సమీక్షించారు.అనంతరం పాతపట్నం వద్ద మహ్రేంద్రతనయ నదిపైగల కాజ్‌వే వంతెనను పరిశీలించారు. కార్యక్రమాలలో మండలప్రత్యేకాధికారి మంచుకరుణాకరరావు తహసీల్దార్ నందిగామప్రసాదరావు, ఎంపీడీవో రమణమూర్తి పాల్గొన్నారు. కాగా మొంథా తుఫాన్ ఎదుర్కొనేం దుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి మంచు కరుణా రరావు తెలిపారు.తహసీల్దార్‌కార్యాలయంలో అన్నిశాఖల మండల స్థాయి అధికారు లతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కె.గోపాలపురం, హెచ్.గోపాలపురం, చంగుడి లోతట్టుప్రాంతాలను పర్యవేక్షించాలని కోరారు.
ఫపలాస, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఒక ప్రకటనలో కోరారు. మంగళ, బుధవారాల్లో అధికవర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశముందని, రైతు లు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా తుఫాన్ పురస్కరించు కుని పూర్తిస్థాయి విధులు నిర్వహించి ప్రజలకు సహాయం చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలని మునిసిపల్ కమిషనర్ ఎన్.రామారావు కోరారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్షించారు.
ఫపలాసరూరల్: తుఫాన్ దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి తెలిపా రు. ఆయాపంచాయతీల్లో వీఆర్వోల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు, పరి స్థితి వివరించేందుకు కంట్రోల్‌రూమ్, ఫోన్‌నెంబరును ఏర్పాటు చేశామని చెప్పారు.
ఫపోలాకి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని రాత్రి సమయంలో అధికారులు అందుబాటులో ఉండి సమాచారం అందజేయాలని తుఫాన్ ప్రత్యేకాధికారి చక్రధర్‌బాబు, ఎస్పీ మహేశ్వరరెడ్డి మహేశ్వరరెడ్డి సూచించారు. తొలుత ఆర్డీవోలక్ష్మణమూర్తి, డీఎల్‌పీవో గోపీబాల, తహసీల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవోరవికుమార్ రాజారాంపురం, రేవుఅంపలాం, అక్కువరం గ్రామాలను, మధ్యాహ్నం జిల్లా మొంథా తుఫాన్ ప్రత్యేకాధికారి చక్రధర్‌బాబు, ఎస్పీ మహేశ్వరరెడ్డి,సీఐ సూర్యనారాయణ,ఏడీ వెంకటమధు, ఏవో చిరంజీవి దండులక్ష్మీపురంలోని తుఫాన్‌షెల్టర్, బెలమర, బొద్దాం, కొత్తరేవు, గుల్లవానిపేట సాగరతీర గ్రామాలను పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు.
ఫమెళియాపుట్టి,అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి):తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని జడ్పీసీఈవో సత్యనారాయణ తెలిపారు.రట్టిణి, గోకర్ణపురం గ్రా మాలను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మహేంద్రతనయలో నీరు పెరిగితే గ్రామస్థులు పునరావాసకేంద్రాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.
ఫమందస,అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్ దృష్ట్యా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.శ్రీకాంత్ తెలిపారు. తీరప్రాంతంలోని 30 గ్రామాల్లోని ప్రజలు సురక్షితగా ఉండేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టామని చెప్పారు. తీర ప్రాంతాల్లో ఉన్న వారికి సూచనలు అందించేందుకు ఎంపీడీవో వై.వెంకట రమణ, ఎస్‌ఐ కృష్ణకుమార్‌లు కలిసి అప్రమత్తం చేశారని తెలిపారు.
ఫవజ్రపుకొత్తూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్ వల్ల సముద్రం అల్ల కల్లోలంగా మారింది.కొన్నిచోట్ల ముందుకురావడంతో మత్స్యకారులు అప్రమత్తమై సామగ్రిని సురక్షత ప్రాంతాలకు తలరించారు. తహసీల్దార్ సీతారామయ్య ఆధ్వ ర్యంలో తీరప్రాంతం పరిశీలించారు. తీరానికి ఎవ్వరు వెళ్ళవద్దని హెచ్చరించారు. శివసాగర్ తీరానికి ఎవ్వరిని వెళ్ళనీయకుండా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు.
ఫజలుమూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి):మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రజలు, రైతులకు నష్టం జరుగకుండా గ్రామాల్లో అధికారులు చర్యలు చేపట్టాలని ప్రత్యేకాధికారి అరుంధతిదేవి ఆదేశించారు. స్థానిక తహసీ ల్దార్ కార్యాలంలో అధికారుల సమీక్షించారు. సమావేశంలో తహసీల్దార్ జె.రామారావు, హౌసింగు ఏఈ ప్రసాదరావు పాల్గొన్నారు.
ఫఎల్.ఎన్.పేట, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో భారీవర్షాలు కురిసే అవకాశంఉండడంతో ప్రజలకు అప్రమత్తంచేశామని తహసీ ల్దార్ జె. ఈశ్వరమ్మ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.లక్ష్మీనర్సుపేట, బసవరాజుపేట, మిరియాపల్లి, వాడవలస, దబ్బపాడు వంశధారనదీ తీరగ్రామాలతోపాటు తురకపేట, ధనుకువాడ,చిట్టిమండలం తది తర లోతట్టు గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో 24 గంటలు ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పా ట్లు చేసినట్లు తెలిపారు.
ఫనందిగాం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉయ్యాలపేట గ్రామా న్ని అధికారులు అధికారులు సందర్శించి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాం తం కావడంతో గ్రామస్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వాలని మండల ప్రత్యేకాధికారి ఐవీ రమణ, తహశీల్దార్ పి.సోమేశ్వ రరావు, ఎంపీడీవో కుమార్‌పట్నాయక్‌లు సూచించారు. తుఫాన్‌ను దృష్టిలో పెట్టుకొని తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్‌సీల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేశా రు. కాగా తుఫాన్ దృష్ట్యా ఉన్నతాధికారుల సూచనల మేరకు నందిగాం బాలికల గురుకులం విద్యార్థులు ఇళ్లకు బయలులేరి వెళ్లారు.