మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీరాములు
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:38 PM
మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీరాములు, ఉపా ధ్యక్షుడిగా బొమ్మాళి చిన్నవాడు ఎన్నికయ్యారు. మంగళ వారం శ్రీకాకుళంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా మత్స్యసహకార సంఘం పి-117 ఎన్నికలు నిర్వహించారు.
పాతశ్రీకాకుళం, డిసెంబరు23 (ఆంధ్రజ్యోతి): మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీరాములు, ఉపా ధ్యక్షుడిగా బొమ్మాళి చిన్నవాడు ఎన్నికయ్యారు. మంగళ వారం శ్రీకాకుళంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా మత్స్యసహకార సంఘం పి-117 ఎన్నికలు నిర్వహించారు. మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కె.గంగాధరరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.జిల్లాలో180మత్స్యసహకార సంఘాలకు గాను 132 సంఘాల నుంచి 132 మందిఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని 11మంది డైరెక్టర్లను ఎన్ను కున్నారు.ఆ 11మంది డైరెక్టర్లు బుడగట్లపాలెం ఎంఎఫ్ సీఎస్ సంఘానికి చెందిన చీకటి శ్రీరాములు అధ్యక్షు డిగా, యలమంచిలిలోని ఐఎఫ్‌సీఎస్ సంఘానికి చెంది న బొమ్మాళి చిన్నవాడు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.