వజ్రకవచంతో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు
ABN , Publish Date - May 12 , 2025 | 11:47 PM
వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమిని పుర స్కరించుకుని రుత్వికులు సుప్రభాత సేవ నిర్వహించారు.
నరసన్నపేట, మే 12(ఆంధ్రజ్యోతి): వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమిని పుర స్కరించుకుని రుత్వికులు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం వజ్రకవ వచంతో మూలవిరాట్‌ను అలంకరించి భక్తులకు దర్శ నం కల్పించారు. ఆలయంలో హోమా లు, పూజాది కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం స్వామి ఉత్సవమూర్తులను గరుడ వా హనంపై వేంచేపు చేసి తిరువీధి ఉత్సవం చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు మార్తి కృష్ణమాచార్యులు, మావుడూరి జగదీష్‌బాబు, జగన్నాథశర్మ, ఆలయ ధర్మకర్తలు, భక్తులుపాల్గొన్నారు.
ఘనంగా తిరువీధి
మెళియాపుట్టి, మే 12( ఆంధ్రజ్యోతి): గొప్పిలిలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలో విగ్రహాల తిరువీధి ఉత్స వం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమేష్ బాబు, సర్పంచ్ పల్లి మోగి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వెంకన్న ఆలయ వార్షికోత్సవం
పాతపట్నం, మే 12(ఆంధ్రజ్యోతి): బోరుభద్ర గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయ 38వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో ప్రారం భమైన కార్యక్రమంలో విశేష పూజలతో పాటు స్వామి వారి కల్యాణం చేపట్టారు. సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ ఊరేగింపులో కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. రాత్రి పర్లాకిమిడికి చెందిన శ్రీనటరాజ నృత్యకళాక్షేత్రం బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన నిర్వహిం చారు.
ఆలయ ఆదాయం రూ.7.31 లక్షలు
పాతపట్నం, మే 12(ఆంధ్రజ్యోతి): పాతపట్నం నీలమణిదుర్గ ఆలయా నికి 53 రోజులకు రూ.7,31,962 ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి టి.వాసుదేవరావు తెలి పారు. ఆలయ హుండీలను దేవదాయ శాఖ ఏసీ కార్యాలయ ప్రతినిధి జీవీబీఎస్ రవి కుమార్ పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు.