srikurmam tempel: శ్రీకూర్మక్షేత్రం ఎంతో అద్భుతం
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:04 AM
vishnu temple at srikuramam ‘ప్రసిద్ధ శ్రీకూర్మం.. శిల్ప సంపదతో ఎంతో అద్భుతంగా ఉంది. ఈ క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంద’ని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం గార మండలంలో శ్రీకూర్మం క్షేత్రాన్ని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
హోంమంత్రి వంగలపూడి అనిత
గార/ అరసవల్లి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ‘ప్రసిద్ధ శ్రీకూర్మం.. శిల్ప సంపదతో ఎంతో అద్భుతంగా ఉంది. ఈ క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంద’ని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం గార మండలంలో శ్రీకూర్మం క్షేత్రాన్ని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కూర్మనాథుడి సన్నిధిలో గోత్రనామాలతో పూజలు చేశారు. స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఈవో కె.నరసింహ నాయుడు, ప్రధాన అర్చకులు సీతారామ నరసింహాచార్యులు ఆమెకు అందజేశారు. అనం తరం ఆలయ ప్రదక్షిణ మండపాన్ని, శిల్ప సంపదను, స్తంభాలపై ఉన్న శాసననాలను ఆమె పరిశీలించారు. ఆలయ చరిత్ర, ప్రాధాన్యం గురించి అర్చకులు దాసుబాబు హోం మంత్రికి వివరించారు. పురావస్తు శాఖాధికారులను సంప్రదించి ఈ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఈవో నరసింహనాయడును ఆమె ఆదేశించారు. హోంమంత్రితో కలిసి ఫొటోలు తీసుకునేందుకు చాలామంది భక్తులు ఆసక్తి చూపారు. భక్తులతో కాసేపు ముచ్చటించి.. ఓ చిన్నారిని ఆమెను ఎత్తుకుని ముద్దాడారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు రాణా శ్రీనివాసమాదిగ హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ వీ.ఎస్.గిరి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆదిత్యుడి సన్నిధిలో..
అరసవల్లిలోని ఆదిత్యుడ్ని కూడా హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆమెకు స్వాగతం పలికారు. ఆలయ అనివెట్టి మండపంలో వేదాశీర్వచనం అందజేశారు. స్వామి ప్రసాదాలు, చిత్రపటాన్ని ఈవో అందజేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి హోంమంత్రిని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదారపు వెంకటేష్, ఉంగటి వెంకటరమణ, జల్లు రాజీవ్, ఇప్పిలి శివ, అర్చకులు హరిబాబు, సందీపశర్మ, రంజిత్‌శర్మ పాల్గొన్నారు.
