Share News

సెమీస్‌కు శ్రీకాకుళం జట్టు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:39 PM

జిల్లా కేంద్రంలో గత రెండు రోజుల నుంచి జరుగు తున్న స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌-19 రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో మంగళవారం శ్రీకాకుళం జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది.

సెమీస్‌కు శ్రీకాకుళం జట్టు
తూర్పుగోదావరి, కృష్ణా జట్ల మధ్య పోటీ

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో గత రెండు రోజుల నుంచి జరుగు తున్న స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌-19 రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో మంగళవారం శ్రీకాకుళం జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌లో కృష్ణా జిల్లా జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ విధానంలో నిర్వ హిస్తున్న ఈ టోర్నమెంట్‌లో నాలుగు పూల్స్‌లో రన్నర్‌, విన్నర్లను క్వార్టర్‌ ఫైనల్స్‌కు అనుమతించారు. దాంతో శ్రీకాకుళం, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. తొలి క్వార్టర్‌లో కృష్ణాపై శ్రీకాకుళం విజయం సాధించగా, తర్వాత గుంటూరుపై పశ్చిమగోదావరి గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తూర్పుగోదావరి, చిత్తూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఇక్కడ కూడా స్కోర్లు సమం కావడం, లైట్‌ ఫెయిల్యూర్‌ అవడంతో మ్యాచ్‌ను బుధవా రం ఉదయానికి వాయిదా వేశారు. విజయ నగరం, విశాఖపట్నం మధ్య పోటీ బుధవారం నిర్వహించనున్నారు. జిల్లాలోని కోడిరామ్మూర్తి స్టేడియం తోపాటు ఆర్ట్స్‌ కళాశాల మైదానం, చిలకపాలేంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం, వేంకటేశ్వర ఇంజినీరింగ్‌, అంబేడ్కర్‌ వర్సిటీల్లో ఈ లీగ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:48 PM