Share News

శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌కు ఉత్తమ సేవా పతకం

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:20 AM

శ్రీకాకుళం జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఉత్తమ సేవా పతకం లభించింది. విజయవాడలో బుధవారం జరిగిన రాష్ట్ర రెడ్‌క్రాస్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు.

శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌కు ఉత్తమ సేవా పతకం
గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నుంచి ఉత్తమ సేవా పతకం అందుకుంటున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • గవర్నర్‌ నుంచి అందుకున్న కలెక్టర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఉత్తమ సేవా పతకం లభించింది. విజయవాడలో బుధవారం జరిగిన రాష్ట్ర రెడ్‌క్రాస్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌ ద్వారా అందించిన విస్తృత సేవలకు ఈ పతకం లభించింది. అలాగే 2022-23 సంవత్సరంలో ఉత్తమ జిల్లా పురస్కారాన్ని రెడ్‌క్రాస్‌ ట్రెజరర్‌ కె.దుర్గాశ్రీనివాస్‌ స్వీకరించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ వైడి రామారావు, వైస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, సెక్రటరీ ఏకే ఫరీడా, కోశాధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:20 AM