సీఎం దృష్టికి శ్రీకాకుళం సమస్యలు: ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:33 PM
శ్రీకాకుళం నియోజకవర్గ సమస్యలను ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకు వెళ్లానని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
శ్రీకాకుళం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నియోజకవర్గ సమస్యలను ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకు వెళ్లానని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం వద్దకు వెళ్లి.. నియోజకవర్గంలో నెలకొన్న సమ స్యలను వివరించానన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం పూర్తికినిధులు మంజూరుచేయాలని, ఆమదాలవలస-పాలకొండ రోడ్డు పూర్తి చేయా లని, కళింగపట్నం ప్యాసింజర్ జట్టీ నిర్మాణానికి నిధులు విడుదలయ్యేట్లు చేయాలని కోరాన న్నారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి సాను కూలంగా స్పందించారని.. త్వరలో ప్రధాన సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.