Share News

ముగిసిన శ్రీరామనామ దశకోటి మహాయజ్ఞం

ABN , Publish Date - May 06 , 2025 | 11:54 PM

ఉపనిషన్మందిరం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో రెండు రోజులుగా సాగుతున్న శ్రీరా మనామ దశకోటి మహా యజ్ఞం, హనుమాన్‌ చాలీసా కోటి పారా యణ, మహాయజ్ఞ పూర్ణాహుతి మహో త్సవాలు మంగళ వారంతో ముగిశా యి.

ముగిసిన శ్రీరామనామ దశకోటి మహాయజ్ఞం
శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు

  • ఘనంగా శోభాయాత్ర

శ్రీకాకుళం కల్చరల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): ఉపనిషన్మందిరం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో రెండు రోజులుగా సాగుతున్న శ్రీరా మనామ దశకోటి మహా యజ్ఞం, హనుమాన్‌ చాలీసా కోటి పారా యణ, మహాయజ్ఞ పూర్ణాహుతి మహో త్సవాలు మంగళ వారంతో ముగిశా యి. ఈ సందర్భం గా ఆధ్యాత్మిక రా మాయణ పారాయ ణ నిర్వహించారు. వీటితో పాటు శ్రీ గాయత్రి, శ్రీరామ, హనుమాన్‌ మూలమంత్ర జపం, అగ్ని ప్రతిష్ఠాపన, సామూహిక లలితా పారాయణం నిర్వహించారు. అనంతరం పండితులు అన్నదాన చిదంబర శాస్త్రిని, భాస్కరభట్ల శ్రీరామశర్మను సత్కరించారు. అనంతరం సీతారాముల విగ్రహలతో శోభాయాత్ర నిర్వహించారు. నృత్య దర్శకురాలు నీరజాసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కోలాటం ప్రదర్శించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌తోపాటు ఆధ్యాత్మికవేతలు పీవీ రమణమూర్తి, విశ్వనాథం, కామేశ్వరరావు, కనుగుల సత్యం, బండారు వెంకటలక్ష్మి, నేరెళ్ల విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, కె.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:54 PM