ఉత్సాహంగా..
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:19 AM
agricultural Sports competitions ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులకు అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, లిటరరీ మీట్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎస్‌ఎస్‌ఆర్ పురంలోని కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో నాలుగు రోజులు నిర్వహించనున్న ఈ పోటీలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ జి.రామచంద్రరావు ప్రారంభించారు.
వ్యవసాయ విద్యార్థుల క్రీడాపోటీలు ప్రారంభం
వివిధ కళాశాలల నుంచి 530 మంది క్రీడాకారులు హాజరు
ఎచ్చెర్ల, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులకు అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, లిటరరీ మీట్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎస్‌ఎస్‌ఆర్ పురంలోని కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో నాలుగు రోజులు నిర్వహించనున్న ఈ పోటీలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ జి.రామచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పాల్గొనడం గొప్ప విశేషమన్నారు. ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ బుడుమూరు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఈ కళాశాలలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 18 వ్యవసాయ కళా శాలల నుంచి 530 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ పీడీ ఆర్.రవికాంత్‌రెడ్డి, నైర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జి.జోగినాయుడు, స్థానిక కళాశాల యాజమాన్య ప్రతినిధులు ఇప్పిలి కిశోర్, కె.దుర్గాశ్రీనివాస్, బీవీఎస్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
తొలి రోజు విజేతలు..
తొలి రోజు పోటీల్లో ఫుట్‌బాల్ మూడు మ్యాచ్‌లు నాక్ అవుట్ విధానంలో నిర్వహించారు. దీనిలో కాలేజ్ ఆఫ్ సీఎఫ్‌ఎస్ కళాశాల పులివెందుల జట్టు, ఎస్వీ వ్యవసాయ కళాశాల (తిరుపతి) జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఎస్వీఆర్ వ్యవసాయ కళాశాల(బద్వేలు)పై కింజరాపు ఎర్రన్నా యుడు వ్యవసాయ కళాశాల (ఎచ్చెర్ల) జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో కేబీఆర్ వ్యవసాయ కళాశాల (సీఎస్‌పురం)పై డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ కళాశాల (బాపట్ల) విజేతగా నిలిచింది.