విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:29 AM
విద్యతో పాటు క్రీడలు శారీరక, మానసిక వికాసం పెంపొందిస్తాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
నరసన్నపేట, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): విద్యతో పాటు క్రీడలు శారీరక, మానసిక వికాసం పెంపొందిస్తాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. గురువారం ఉర్లాం ఉన్నత పాఠశాల ఆవరణలో మండలస్థాయిలో గ్రిగ్స్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పొందర, కురాకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర్సింహాలు, టీడీపీ మండల అధ్యక్షుడు అడపా చంద్రశేఖర్, వంశధార డీసీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, పీఏసీఎస్ అధ్యక్షుడు ఇసా అప్పారావు, రాష్ట్ర రైతు సంఘ కార్యదర్శి జల్లు చంద్రమౌళి, తొగరాం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం యాళ్ల పోలినాయు డు, పీడీలు రమణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.